సినిమాల్లో ఈత దుస్తులు, పొట్టి గౌన్లు, చిన్న స్కర్టులతో... హాట్‌గా కనిపించే అనుష్క విడిగా మాత్రం చాలా సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరిస్తారు. సినిమాలకు సంబంధించిన, ఇతర వేడుకల్లో చాలావరకు చుడీదార్లు, లేకపోతే... చీరల్లోనే హాజరై అందరి దృష్టినీ ఆకర్షిస్తారామె. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి అనుష్క దగ్గర ప్రస్తావించినప్పుడు - ‘‘సినిమా కలర్‌ఫుల్‌గా ఉండాలంటే హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించాలి.
అది కూడా కథానుసారమే తప్ప కావాలని ఎక్స్‌పోజ్ చేయాలని కాదు. ఇక విడిగా అంటారా?... ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు డ్రెస్ చేసుకుంటారు. నాకు చుడిదార్లు, చీరల్లో నిండుగా ఉండటం ఇష్టం. పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గొన్నప్పుడు అందంగా కనిపిస్తే చాలు.. గ్లామరస్‌గా కనిపించాల్సిన అవసరం లేదు. అందుకే నాకు నచ్చినట్లుగా దుస్తులు ధరిస్తుంటాను’’ అని చెప్పారు. ఆ విషయం అలావుంచి, నేటి తరం నాయికల్లో మీకు నచ్చినవాళ్లెవరు? అన్నప్పుడు -‘‘అందరూ ఇష్టమే. తమన్నా, కాజల్ ఎక్కువ ఇష్టం.
తమన్నా హార్డ్‌వర్కర్. ఇతర నాయికలు కష్టపడటంలేదని కాదు. నాకెందుకో తమన్నా లుక్స్, యాక్టింగ్ బాగా నచ్చుతాయి. ప్రస్తుతం ఎక్కువమంది కథానాయికలు ఉండటంతో పోటీ మెండుగా ఉంది. అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉండటం ఆనందంగా ఉంది. నేను నా ఎదుగుదలను కోరుకున్నట్లుగానే.. సిన్సియర్‌గా కష్టపడే హీరోయిన్లందరూ పైకి రావాలని కోరుకుంటాను’’ అన్నారు అనుష్క.
No comments:
Post a Comment